Andhra Pradesh : రేపే స్త్రీ శక్తి పథకం ప్రారంభం.. ఆ బస్సులో ఫ్రీ జర్నీ వర్తించదు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న స్త్రీ శక్తి పథకం రేపు ప్రారంభం కానుంది. ఈ పథకం ప్రకారం ఏపీకి చెందిన మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ బస్ స్టాండ్‌లో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సీఎం ప్రారంభించిన తర్వాత జీరో ఫెయిర్ టికెట్ల జారీ మొదలు కానుంది. ఏపీలో నివాసం ఉంటున్నట్లు ధృవీకరణ పత్రాలు ఉన్న బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్ల ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంది. అయితే నాన్ స్టాప్ బస్సు లతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే పర్యాటక, సూపర్ లగ్జరీ, సప్తగిరి , అల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో ఈ స్కీమ్ వర్తించదని అధికారులు వెల్లడించారు. అలాగే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ మధ్య తిరిగే ఇంటర్ స్టేట్ ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం ఉండదని స్పష్టం చేశారు. అలాగే మహిళలు తప్పకుండా తమ ఐడి కార్డులను వెంట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com