కొత్త జాబ్‌ క్యాలెండర్‌ కోసం రేపు సీఎం ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు..!

కొత్త జాబ్‌ క్యాలెండర్‌  కోసం రేపు సీఎం ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు..!
ఎక్కడిక్కడ విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అనంతపురంలో జేసీ పవన్‌కుమార్‌రెడ్డి ఇంటివద్ద ముందస్తుగా భారీగా పోలీసులు మోహరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జాబ్‌ క్యాలెండర్‌ విడుదల కోసం.. తెలుగుయువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు రేపు ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి పిలుపునివ్వటంతో...ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎక్కడిక్కడ విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అనంతపురంలో జేసీ పవన్‌కుమార్‌రెడ్డి ఇంటివద్ద ముందస్తుగా భారీగా పోలీసులు మోహరించారు. జేసీ పవన్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసి గృహనిర్భందంలో చేశారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చిన సీఎం జగన్...హామీలను తుంగలోతొక్కారని జేసీ పవన్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.

పలుచోట్ల తెలుగుదేశం అనుబంధసంఘాల నేతలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పవన్‌కు మద్దతుగా శ్రేణులు ప్లకార్డుల ప్రదర్శించారు. అటు తిరుపతిలోనూ చలో సీఎం ఇంటి ముట్టడికి బయల్దేరిన తెలుగుదేశం అనుబంధసంఘాల నేతలను ముందుస్తుగా అరెస్టు చేసిన పోలీసులు....ఎస్వీయూ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌కు వ్యతిరేకిస్తూ...న్యాయం కోసం రోడ్డెక్కుతున్న నిరుద్యోగులను హౌస్‌ అరెస్టు చేయటం దారుణమని సీపీఎం నేత కుమార్‌ విమర్శించారు.

నిర్భందాలతో ఉద్యమాలను అణిచివేయాలని చూడటం సరైందికాదన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుయువత, టీఎన్‌ఎస్ఎఫ్‌ నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్న పోలీసుల....మంగళగిరిరూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విద్యార్థిసంఘాల నేతలు డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story