NTR district: సోషల్ మీడియాలో పోస్టింగ్‌పై విద్యార్థుల ఘర్షణ.. బీరు సీసాలు, క్రికెట్ బ్యాట్లతో దాడి..

X
NTR district: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో విద్యార్థులు రెచ్చిపోయారు. స్టూడెంట్స్ మధ్య ఘర్షణలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానిక మిక్ ఇంజనీరింగ్ కళాశాలలో.... సెకండ్ ఇయార్ డిప్లమా విద్యార్థులు, ఫస్ట్ ఇయార్ విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో పోస్టు విషయమై ఇరువురి మధ్య వివాదం తలెత్తింది. వివాదం కాస్తా చినికి చినికి గాలివానలా మారి సీనియర్ విద్యార్థిపై జూనియర్లు దాడి చేసేదాక వెళ్లింది. బీరు సీసాలు, బ్యాట్లతో దాడికి దిగారు. ఘర్షణలో ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అటు విద్యార్థుల మధ్య ఘర్షణ విషయంపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పోలీసులు మండిపడ్డారు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
