Tirumala: తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 48 గంటలు..

Tirumala: తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 48 గంటలు..
Tirumala: తిరుమల భక్తులతో కిక్కిరిసింది. అనూహ్యంగా రద్దీ పెరిగింది. దీంతో దర్శనానికి 48 గంటల సమయం పడుతుంది.

Tirumala: తిరుమల భక్తులతో కిక్కిరిసింది. అనూహ్యంగా రద్దీ పెరిగింది. దీంతో దర్శనానికి 48 గంటల సమయం పడుతుంది. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వెలుపల భారీ క్యూలు ఉన్నాయి. నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్ల దగ్గర నుంచి రాంభగీచా వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దాదాపు రెండున్నర కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో ఉన్నారు.

శ్రీవారి ఆలయం మొదలుకొని మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కౌంటర్‌, కాటేజీలు, బస్టాండ్‌, అన్నప్రసాద భవనం సహా తిరుమల గిరులన్నీ రద్దీగా మారాయి. దీంతో పిల్లలు, పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్, విద్యార్థులకు సెలవు రోజులు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారని TTD అధికారులు తెలిపారు. గదులకు కూడా డిమాండ్‌ కొనసాగుతోంది. సీఆర్వో, ఎంబీసీ, గదుల రిజిస్ర్టేషన్‌ కౌంటర్లు భక్తులతో నిండిపోయాయి.

తిరుమలలో గది పొందేందుకు దాదాపు 5 గంటల సమయం పడుతోంది. మరోవైపు కళ్యాణ కట్టలు కూడా యాత్రికులతో కిక్కిరిసిపోయాయి. టైం స్లాట్ టోకెన్‌లతో పాటు టిక్కెట్ లేని వారికి కూడా TTD దర్శనం కల్పిస్తుండడంతో వేలాదిగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో TTD అప్రమత్తమైంది. మూడు రోజుల పాటు బ్రేక్‌ దర్శనాలు రద్దు చేసింది. మరో నాలుగైదు రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. భక్తులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని TTD ఈవో ఏవీ ధర్మారెడ్డి కోరారు.

నిన్న సాయంత్రం భక్తులు వేచి ఉన్న క్యూలైన్లను పరిశీలించారు. భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నామని తెలిపారు. వైకుంఠ ఏకాదశి, గరుడ సేవ లాంటి పర్వదినాల కంటే ఎక్కువ మంది భక్తులు విచ్చేశారన్నారు. నిన్న శ్రీవారిని సుమారు 80వేల మంది దర్శించుకున్నారు. 41వేల మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి ఆలయంలో గంటకు 4వేల 500 మంది భక్తులకు మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story