Bapatla District : బస్సులో అకస్మాత్తుగా మంటలు.. విద్యార్థులు ఎలా తప్పించుకున్నారంటే!

Bapatla District : బస్సులో అకస్మాత్తుగా మంటలు.. విద్యార్థులు ఎలా తప్పించుకున్నారంటే!
X

ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారి మంటలు చెలరేగాయి. ఈ ఘటన బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద జాతీయ రహదారిపై సంభవించింది. రేపల్లె IRES విద్యా సంస్థలకు చెందిన బస్సు మంటల్లో దగ్ధమైంది. నర్సింగ్ విద్యార్థులను తీసుకువెళ్తున్న కళాశాల బస్సులో షాట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. ముందుగా బస్సు ఇంజన్‌ లోంచి పొగను గుర్తించి విద్యార్థులు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గుంటూరులో నర్సింగ్ విద్యార్థులకు పరీక్ష ఉండటంతో వారిని తీసుకువెళ్తుండగా బస్సు మార్గమధ్యలో ప్రమాదానికి గురైంది. స్థానికులు స్పందించి నీళ్లు పోసి మంటలను అదుపుచేశారు. తరువాత రేపల్లె ఫైర్‌ సిబ్బంది స్పాట్‌కు చేరుకుని మంటలను ఆర్పివేశారు.

Tags

Next Story