Fear of demons : ఆ ఊరిలో దెయ్యాల భయం.. వణుకుతున్న కాండ్రకోట గ్రామం

Fear of demons : ఆ ఊరిలో దెయ్యాల భయం.. వణుకుతున్న కాండ్రకోట గ్రామం

ఈ కాలంలోనూ దెయ్యాలున్నాయా అనకండి. అదే భయంతో ఓ ఊరికి ఊరే గజ్జుమంటోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో దెయ్యాలు ఉన్నాయన్న సమాచారంతో స్థానికులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇప్పటి వరకు ఆ దెయ్యాన్ని ఎవరూ చూడలేదు కానీ చీకట్లో ఎక్కడి నుంచో వస్తున్న వింత శబ్దాలు విన్నామని భయంతో చెబుతున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారం మొదలుకాగానే పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఎండు మిరపకాయలతో ఎవరో పూజ చేసినట్లు గ్రామస్థులు గుర్తించారు. అమావాస్య రోజున గ్రామంలోని శివాలయంతోపాటు నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో అష్టభైరవి మహాశక్తి హోమం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రారంభించినట్లు గ్రామస్తులు తెలిపారు. అర్థరాత్రులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇంటి తలుపు తడుతున్నాడని అక్కడున్న కొందరు మహిళలు చెబుతున్నారు.

మాఘ గుప్త నవరాత్రుల కాలంలో కొందరు మంత్ర, తంత్ర విద్యలు నేర్చుకోవడం మొదలుపెడతారు. ఇవి నేర్చుకోవడానికి ఇది సరైన సమయం కావడంతో.. ఇలాంటి ప్రయత్నాలు జరుగుతుండొచ్చు అని పండితులు చెబుతున్నారు. పొడవాటి జుట్టు, పెద్ద కాళ్ళతో ఒక నల్లని వ్యక్తి, బట్టలు లేకుండా, చెట్టు నుండి దూకి అదృశ్యమయ్యాడని ఒక గ్రామస్థుడు చెప్పడం ఈ వార్తలకు బలాన్నిస్తోంది. దీంతో... యువకులు రాత్రిపూట కర్రలతో కాపలాగా ఉంటున్నారు. పోలీసులు కూడా గ్రామంలోకి వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చినా ఫలితం లేకుండా పోతోంది.

Tags

Next Story