Amaravati: అమరావతి భూములపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Amaravati Lands: రాజధాని అమరావతి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కగా.. ఆ పిటిషన్‌పై జస్టిస్ వినీత్ శరణ్, దినేష్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే వాదనలు వినిపించగా.. ఆయన వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఈ కేసును సిట్ కేసుతో జతపరచాలన్న దవే అభ్యర్థనను తిరస్కరించింది.. ప్రాథమిక దర్యాప్తును నిలిపివేసే అధికారం హైకోర్టుకు లేదని దవే వాదించగా.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ వర్తించదని హైకోర్ట్ ఇచ్చిన ఆర్డర్‌లో తప్పేముందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు అన్ని కోణాలను పరిశీలించి తీర్పు ఇచ్చిందని, రాజధాని అంశం బహిరంగ రహస్యమని హైకోర్టు చెప్పడంలో తప్పేముందని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.
భూములు అమ్మిన వాళ్లు మోసపోయామని ఎక్కడైనా ఫిర్యాదు చేశారా అని కొశ్చన్ చేసింది. నష్టం వచ్ఇచన వాళ్లే క ఓర్టును ఆశ్రయించాలి కానీ, ఇందులో ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటో చెప్పాలంది.. అయితే, వాదనలు వినిపించేందుకు సమయం కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది దవే కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com