SC: ఏపీ మద్యం కుంభకోణం కీలక సూత్రధారి రాజ్ కెసిరెడ్డి: సుప్రీం

SC: ఏపీ మద్యం కుంభకోణం కీలక సూత్రధారి రాజ్ కెసిరెడ్డి: సుప్రీం
X
ఏపీ మద్యం కుం­భ­కో­ణం కే­సు­లో కీలక పరి­ణా­మం

చో­టు­చే­సు­కుం­ది. ఏపీ లి­క్క­ర్ స్కా­మ్ కే­సు­పై వి­చా­రణ చే­ప­ట్టిన ధర్మా­స­నం.. ప్ర­ధాన నిం­ది­తు­డైన రాజ్ కె­సి­రె­డ్డి పా­త్ర­పై కీలక వ్యా­ఖ్య­లు చే­సిం­ది. గత ప్ర­భు­త్వా­ని­కి కె­సి­రె­డ్డి కే­వ­లం సల­హా­దా­రు­డు మా­త్ర­మే­న­ని అతని తరపు న్యా­య­వా­ది తె­లు­ప­గా.. ఆయన వా­ద­న­ల­ను సీ­జేఐ ధర్మా­స­నం తో­సి­పు­చ్చిం­ది. కె­సి­రె­డ్డి కే­వ­లం సల­హా­దా­రు మా­త్ర­మే కా­ద­ని.. సూ­త్ర­ధా­రి అని పే­ర్కొం­ది.

ఆర్కిటెక్ట్ అతనే

ఈ కే­సు­లో మొ­త్తం వ్య­వ­హా­రా­ని­కి రాజ్ కె­సి­రె­డ్డి­నే ప్ర­ధాన కు­ట్ర­దా­రు­డ­ని పే­ర్కొం­ది. పద­వి­లో ఉన్న­వా­రి అం­డ­లే­కుం­డా అధి­కా­రు­లు ఇం­త­పె­ద్ద స్కా­మ్ చే­య­లే­ర­ని ఆరో­పిం­చిం­ది. ఇప్ప­టి­కే కె­సి­రె­డ్డి జై­లు­లో ఉండి 10 నె­ల­లు గడి­చిం­ద­ని, సప్లి­మెం­ట­రీ ఛా­ర్జి­షీ­ట్లు కూడా దా­ఖ­లు చే­శా­ర­ని కో­ర్టు­కు తె­లి­పా­రు. దీ­ని­పై స్పం­దిం­చిన సీ­జేఈ సూ­ర్య­కాం­త్.. మరి­కొం­త­కా­లం జై­ల్లో­నే ఉంటే వచ్చిన నష్ట­మే­మి­లే­ద­ని లే­ద­న్నా­రు. గతం­లో ఏపీ హై­కో­ర్టు బె­యి­ల్ ని­రా­క­రిం­చ­డం­తో సు­ప్రీం­కో­ర్టు­ను ఆశ్ర­యిం­చా­రు. రాజ్ కె­సి­రె­డ్డి రె­గ్యు­ల­ర్ బె­యి­ల్ పి­టి­ష­న్ ను వి­చా­రిం­చేం­దు­కు సీ­జేఐ ధర్మా­స­నం ని­రా­క­రిం­చిం­ది. పి­టి­ష­న్ ను డి­స్మి­స్ చే­సేం­దు­కు కో­ర్టు సి­ద్ధ­మ­వ్వ­డం­తో తమ పి­టి­ష­న్ ను వె­న­క్కి తీ­సు­కుం­టా­మ­ని రాజ్ తరపు న్యా­య­వా­ది కో­ర్టు­కు తె­లు­ప­గా.. అం­దు­కు అం­గీ­క­రిం­చిం­ది. ఈ కుం­భ­కో­ణం­లో కె­సి­రె­డ్డి ఎన్ని కో­ట్లు అక్ర­మం­గా ఆర్జిం­చా­ర­ని సి­జెఐ జస్టి­స్‌ సూ­ర్య­కాం­త్‌ ప్ర­శ్నిం­చా­రు. రూ.750 కో­ట్లు డి­పా­జి­ట్‌ చే­సిన షె­ల్‌ కం­పె­నీ­ల­తో కె­సి­రె­డ్డి­కి నే­రు­గా సం­బం­ధా­లు­న్న­ట్లు కని­పి­స్తోం­ద­ని ధర్మా­స­నం తె­లి­పిం­ది.

కె­సి­రె­డ్డి జై­లు­లో ఉండి ఇప్ప­టి­కే 10 నె­ల­లు గడి­చి­పో­యా­న­ని.. సప్లి­మెం­ట­రీ ఛా­ర్జ్‌­షీ­ట్లు కూడా దా­ఖ­లు చే­శా­ర­ని ఆయన తరఫు న్యా­య­వా­ది తె­లి­పా­రు. ఏం కా­ద­ని.. మరి­కొం­త­కా­లం జై­లు­లో ఉం­డ­నీ­యం­డ­ని జస్టి­స్‌ సూ­ర్య­కాం­త్‌ వ్యా­ఖ్యా­నిం­చా­రు. కె­సి­రె­డ్డి­కి రె­గ్యు­ల­ర్‌ బె­యి­ల్‌ ఇచ్చేం­దు­కు ధర్మా­స­నం ససే­మి­రా అంటూ పి­టి­ష­న్‌­ను డి­స్మి­స్‌ చే­సేం­దు­కు సి­ద్ధ­మైం­ది. అయి­తే పి­టి­ష­న్‌­ను ఉప­సం­హ­రిం­చు­కుం­టా­మ­ని కె­సి­రె­డ్డి తరఫు న్యా­య­వా­ది పే­ర్కొ­న­డం­తో అను­మ­తిం­చిం­ది.

Tags

Next Story