అవినాష్‌ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ

అవినాష్‌ రెడ్డికి  సుప్రీం కోర్టు నోటీసులు జారీ
వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అవినాష్‌‌తో పాటు సీబీఐకి కూడా సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది.

వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అవినాష్‌‌తో పాటు సీబీఐకి కూడా సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు అవినాష్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ సునీత సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు.ఇవాళ సుప్రీంలో సునీత పిటిషన్‌పై విచారణ జరిగింది. సునీత త‌ర‌పున సీనియ‌ర్ కౌన్సిల్ సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ క్రమంలో అవినాష్‌ రెడ్డితో పాటు సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది. జులై 3న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తి డివై చంద్రచూడ్ ధ‌ర్మాస‌నం ముందు కేసును విచారించాల‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story