Jagan Bail: జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్

అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టగా రఘురామకృష్ణ రాజు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అక్రమాస్తుల కేసులో జగన్ గత పదేళ్లుగా బెయిలుపై ఉన్నారని, ఆంధ్రప్రదేశ్‌లో అధికారానికి వచ్చిన తర్వాత సాక్ష్యాలను చెరిపేస్తున్నారని రఘురామ తరపు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. ఈ దశలో
సాక్ష్యాలు చెరిపేస్తున్నారనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ధర్మాసనం.. రఘు రామకృష్ణరాజు తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ మేరకు కేసు పూర్వాపరాలు, జరిగిన ఘటనలపై వివరాలను రఘురామ తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ కోర్టుకు సమర్పించారు. జగన్‌కు బెయిల్ మంజూరు చేసిన తర్వాతదర్యాప్తు సంస్థలు ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయలేదని కోర్టుకు వివరించారు. జగన్‌కు, కేంద్ర దర్యాప్తుసంస్థ సీబీఐ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతోందని న్యాయవాది తెలిపారు. అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా బెయిలుపై ఉన్న జగన్‌ట్రయల్ కోర్టు ముందు హాజరుకాకుండా శాశ్వత మినహాయింపు పొందారని వివరించారు. ఈ కేసు దర్యాప్తు మొదలై పదేళ్లయినప్పటికీ అభియోగాల నమోదు చేపట్టలేదని ఈ విషయంలో దర్యాప్తు సంస్థ మౌన ప్రేక్షక పాత్ర పోషిస్తోందని వాదించారు. ఇదే అంశాలను తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నప్పటికీ పరిగణనలోకి తీసుకోకుండా కొట్టివేసిందని బాలాజీ శ్రీనివాసన్ సుప్రీం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సీబీఐ ఇంతవరకు సుప్రీంలో సవాలు చేయలేదని గుర్తుచేశారు. ఇదే వ్యవహారంలో కేసు ట్రయల్‌ను హైదరాబాద్ నుంచి దిల్లీకి బదిలీ చేయాలని తాము వేసిన పిటిషన్ పెండింగ్ ఉందని దానిలో ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్లు బాలాజీ శ్రీనివాసన్ కోర్టుకు వివరించారు. CBI కేసుల విచారణ తర్వాతే ఈడీ కేసుల విచారణ చేయాలని... హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈడీ కూడా ఇటీవల సుప్రీంకోర్టులో సవాలు చేసిందని బాలాజీ శ్రీనివాసన్ ధర్మాసనానికి వివరించారు.
ఈడీ పిటిషన్ పెండింగ్ ఉందని బాలాజీ శ్రీనివాసన్ చెప్పగాఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా? అని ధర్మాసనం ప్రశ్నించంది. అయితే. నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని రఘురామ తరపు న్యాయవాది కోరగావిచారణను హైదరాబాద్ నుంచి మార్చాలన్న పిటిషన్, ఈడీ వేసిన పిటిషన్‌కు బెయిల్ రద్దు పిటిషన్‌ను జత చేయాలని ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. ఈలోపు జగన్, సీబీఐ, ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి తొలి వారానికి వాయిదా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com