Crime News : సతీష్ ది హత్యే.. సీన్ రీ క్రియేషన్ లో సంచలనాలు.

తిరుమల పరకామణి కేసులో కీలక సాక్షి అయిన టీటీడీ మాజీ ఏవీఎస్ వో సతీష్ కుమార్ మరణం సంచలనంగా మారింది. ఆయన్ను హత్య చేసి ఉంటారనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు పరిస్థితుల్ని బట్టి ఆలోచిస్తే ఇది హత్యే అనే అనుమానాలు గట్టిగా వ్యక్తమవుతున్నాయి. ట్రైన్ ప్రమాదాన్ని అంచనా వేసేందుకు మొన్న, నిన్న సీన్ రీ క్రియేషన్ చేశారు. నిన్న తాడిపత్రి మండలం కోమలిలోని సంఘటనా స్థలం వద్ద మూడు బొమ్మలతో సీన్ రీ క్రియేషన్ చేశారు. సరిగ్గా సతీష్ మృతదేహం దొరికిన చోటనే ఈ బొమ్మలను విసిరేశారు. ఒక బొమ్మ పది అడుగు దూరంలో పడగా.. ఇంకో రెండు బొమ్మలు దగ్గర్లోనే పడ్డాయి. కానీ సతీష్ మృతదేహం మాత్రం ఈ బొమ్మలు పడ్డదాని కంటే ఇంకా దూరంలోనే లభ్యమైంది.
ఆశ్చర్యకరంగా సతీష్ మృతదేహం మాత్రం ఈ బొమ్మలు పడిన చోటుకంటే మరింత దూరంలో ఉండటంతో పోలీసుల అనుమానాలు మరింత బలపడుతున్నాయి. పైగా ఆయన సెల్ ఫోన్ కూడా ఎలాంటి డ్యామేజ్ లేకుండా దొరికింది. ఎంత సూసైడ్ చేసుకున్నా సరే అంత దూరం పడడు కదా. దీనితో రైల్వే ప్రమాదం కాదని ఇది కచ్చితంగా హత్యే అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పరకామణి కేసులో డాలర్ల దొంగలను నిందితులుగా చేర్చారు. సతీష్ ప్రయాణించిన ఏసీ కోచ్ ప్రయాణికుల లిస్ట్ ను కూడా తీస్తున్నారు.
ట్రైన్ టీసీలను కూడా ఆరా తీస్తున్నారు. అలాగే ట్రైన్ లో ఉండే పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఎటు చూసినా సరే సతీష్ ది సహజ మరణం కాదని.. కచ్చితంగా హత్యే అనే అనుమనాలు పెరిగిపోతున్నాయి. సతీష్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఆయన కుటుంబీకులు చెబుతున్నారు. పరకామణి కేసులో నిందితులే సతీష్ ను మర్డర్ చేసి ఉంటారని వాళ్లు అనుమానాలు వ్యక్తం చేయడంతో.. పోలీసులు కూడా ఆ వైపుగా విచారణ సాగిస్తున్నారు. వారంలోపు ఈ కేసులో అసలు నిజాలను బయట పెడుతామన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

