తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ

అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ఎన్నికల వాయిదా వేయించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ-వైసీపీల మధ్య ఉద్రిక్తతల్ని దృష్టిలో పెట్టుకుని పట్టణమంతా 144 సెక్షన్ విదించారు. మున్సిపల్ ఆఫీస్‌కు కిలోమీటర్ పరిధిలో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. దాదాపు 600 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. 25 మంది SIలు, 15 మంది CIలతోపాటు డాగ్‌స్క్వాడ్‌ను కూడా సెక్యూరిటీ కోసం ఉంచారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ చైతన్య హెచ్చరిస్తున్నా రు. సభ్యులంతా 11 గంటలలోపే సమావేశానికి హాజరుకావాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. ఐతే.. ఇక్కడే YCP కుట్రలకు పాల్పడుతోంది అనేది TDP ఆరోపణ. శిబిరం నుంచి తమ సభ్యుల్ని నేరుగా సమావేశానికి తీసుకు వచ్చేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది.
తాడిపత్రి మునిసిపాలిటీలో 36 స్థానాలు ఉంటే అందులో టీడీపీ- 18, వైసీపీ- 16 చోట్ల గెలుపొందాయి. ఒక చోట గెలిచిన CPI, ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా టీడీపీకే మద్దతు ప్రకటించారు. ఐతే.. YCPకి 2 ఎక్స్ అఫీషియో ఓట్లు ఉండడంతో ఆ పార్టీ బలం 18కి పెరిగింది. ఐతే.. CPI, ఇండిపెండెంట్ మద్దతుతో ఛైర్మన్ పీఠం TDP వశం అయ్యే అవకాశం ఉన్నా.. కావాలనే తమకు ఆటంకాలు సృష్టిస్తున్నారని, తమ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి, బెదిరింపులకు పాల్పడి కుట్రలు చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే TDP, CPIలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. ఐతే.. సమావేశం సజావుగా సాగుతుందా.. ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com