Tandel Piracy : ఆర్టీసీ బస్సులో తండేల్! .. పైరసీ పై నిర్మాత నిప్పులు

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ సినిమాను పైరసీ వేధిస్తోంది. తాజాగా ఏపీఎస్ఆర్డీసీ బస్సులో దీన్ని ప్రదర్శించడంపై నిర్మాత బన్నివాసు స్పందించారు. 'ఓ మీడియా సంస్థలో వచ్చిన వార్త ద్వారా ఏపీఎ స్ఆర్డీసీ బస్సులో తండేల్ను ప్రదర్శించారని తెలుసుకున్నాం. ఇది చట్ట విరుద్ధం, అన్యాయం మాత్రమే కాదు సినిమాకు జీవం పోయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోన్న ఎంతోమంది వ్యక్తులను అవమానించడమే. ఒక సినిమా ఎంతోమంది ఆర్టిస్టులు, దర్శకులు, నిర్మాతల కల' అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. బాధ్యు లపై చర్యలు తీసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావును బన్నివాసు కోరారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. మరోవైపు థియేటర్ల వద్ద ‘తండేల్’ మూవీ కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.62.37 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు చేసినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. యువసామ్రాట్ చైతూ కెరీర్లో ఇవే అత్యంత వేగవంతమైన కలెక్షన్లని తెలిపింది. ఈ సినిమాలో మ్యూజిక్‌తో పాటు చైతన్య, సాయి పల్లవి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com