AP : కాకినాడ పోర్టుపై టాస్క్ ఫోర్స్ కమిటీ

AP : కాకినాడ పోర్టుపై టాస్క్ ఫోర్స్ కమిటీ
X

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్ర బాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సోమ వారం ఉండవల్లి వేదికగా సాగిన లంచ్ మీటింగ్లో వారిరువురి మధ్య కీలకమైన అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. సుదీర్ఘంగా సాగిన చంద్రబాబు, పవన్ భేటీలో కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర విచారణ జరపాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సీఎం చంద్రబాబు సమగ్ర విచారణకు ఆదేశిస్తానని, అందుకోసం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల పరిధిలో బియ్యం మాఫియా పెద్ద నెట్వర్క్ నడిపి కోట్లాది రూపాయల విలువైన బియ్యాన్ని దోచుకున్నారని, అందుకు సంబంధించి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు పరిశీలన సందర్భంలో తాను గుర్తించిన పలు అంశాలను ఆయన ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

Tags

Next Story