టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం

X
టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. వర్చువల్‌గా జరిగిన ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టీడీఎల్పీలో నిర్ణయించారు. రైతుల సమస్యలపై అసెంబ్లీలో జగన్ ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్యేలు నిర్ణయానికి వచ్చారు. అలాగే ఇసుక ధరలు, మద్యం అమ్మకాలు... ఇతర ప్రజా సమస్యలపైనా సర్కార్‌ను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు టీడీపీ నేతలు. మరోవైపు అసెంబ్లీకి టీవీ5తోపాటు మరికొన్ని చానెల్స్‌ను ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్న నిర్ణయం జరిగింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
