TDP : ప్రారంభమైన టీడీపీ జోన్ 1 క్లస్టర్స్ యూనిట్స్ మీటింగ్

TDP : ప్రారంభమైన టీడీపీ జోన్ 1 క్లస్టర్స్ యూనిట్స్ మీటింగ్
పీఎంపాలెం విశాఖ కన్వెన్షన్‌ కేంద్రంలో టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సు జరుగుతోంది

విశాఖలో టీడీపీ జోన్ 1 క్లస్టర్స్ యూనిట్స్ మీటింగ్ ప్రారంభమైంది. పీఎంపాలెం విశాఖ కన్వెన్షన్‌ కేంద్రంలో టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సు జరుగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటా 15నిమిషాలకు టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖకు చేరుకుంటారు. అక్కడి నుంచి పీఎం పాలెంలోని విశాఖ కన్వెన్షన్‌కు వెళతారు. మధ్యాహ్నం 2గంటల 15నిమిషాల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సదస్సులో పాల్గొంటారు.

ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల నుంచి యూనిట్‌ బాధ్యులు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జులు కలిపి 2వేల 500మంది వరకు హాజరవుతున్నారు. వీరితోపాటు ఆరు జిల్లాల పరిధిలోని నియోజకవర్గ బాధ్యులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఎంపీలు, మాజీ ఎంపీలు, పార్టీ నేతలు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ క్యాడర్‌ను సన్నద్ధం చేయడంతో భాగంగా టీడీపీ జోన్ల వారీ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story