తిరుమలను వివాదాలకు కేంద్రంగా మార్చేస్తున్నారు : చంద్రబాబు

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలను వివాదాలకు, వివాదాస్పద నిర్ణయాలకు కేంద్రంగా మార్చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారంటూ మండిపడ్డారాయన. గతంలో జాతీయ బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచిత సేవలు అందించేవన్నారు. దీని వల్ల టీటీడీపై ఒక్క పైసా భారం ఉండేది కాదన్నారు. పైగా ఈ సేవా కార్యక్రమాల్లో ఎంతో మంది భక్తులు స్వచ్ఛందంగా పాల్గొని శ్రీవారి ఉచిత దర్శనాన్ని పొందే వీలుండేదన్నారు. అలాంటి స్వచ్ఛంద, ఉచిత సేవలు చేస్తున్న వారిని తప్పించి.... లడ్డూ వితరణ, కల్యాణకట్ట, దర్శన టికెట్లస్కానింగ్ వంటి సేవలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడం ఎంతవరకు సబబను ప్రశ్నించారు చంద్రబాబు. పవిత్ర పుణ్యక్షేత్రంలో.... వ్యాపార బీజాలు నాటడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ల కక్కుర్తి కాకపోతే... సజావుగా బ్యాంకులు, శ్రీవారి సేవకుల ద్వారా సాగిపోతున్న ఉచిత సేవలను కాదని ఎదురు చెల్లింపు చెల్లించడమేంటని ప్రశ్నించారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com