మావోయిస్టుల దాడిని ట్వీట్టర్‌లో ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు..!

Nara chandrababu Naidu (File Photo)
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో జవాన్ల మృతి ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్టర్‌లో స్పందించారు. అసువులు బాసిన తెలుగు జవాన్ల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎదురుకాల్పుల్లో గుంటూరు జిల్లా గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ, విజయనగరం గాజులరేగకు చెందిన రౌతు జగదీష్ మరణించడం విషాదకరమని చంద్రబాబు అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన తెలుగువీరుల కుటుంబాలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుని తక్షణం ఆర్థిక సాయం అందించాలన్నారు. తెలుగునేల ఇద్దరు ముద్దుబిడ్డలను పోగొట్టుకోవడం దురదృష్ణకరమని నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో విజయనగరం పట్టణం గాజుల రేగకు చెందిన రౌతు జగదీశ్, గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలం, గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ అనే వీరజవానులు మరణించడం విషాదకరం.(1/2) pic.twitter.com/EbAmdNy2b4
— N Chandrababu Naidu (@ncbn) April 5, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com