రాష్ట్ర ఆత్మను దోచుకోవాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుంది : చంద్రబాబు

రాష్ట్ర ఆత్మను దోచుకోవాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుంది : చంద్రబాబు

Nara chandrababu Naidu (File Photo)

విశాఖ ఉక్కు పరిశ్రమను సాదించే క్రమంలో చేసిన ప్రాణత్యాగాలకు సీఎం జగన్ విలువ లేకుండా చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

విశాఖ ఉక్కు పరిశ్రమను సాదించే క్రమంలో చేసిన ప్రాణత్యాగాలకు సీఎం జగన్ విలువ లేకుండా చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించిన సంస్థ విశాఖ ఉక్కు అని అన్నారు. ఆమరణ దీక్షతో ఉక్కు ఉద్యమానికి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఊపిరి పోశారన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విచ్ఛిన్నానికి పూనుకుందన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రాకు గుండెకాయలాంటిదన్నారు చంద్రబాబు. ఉమ్మడి ఆంధ్రలో అందరూ ఉక్కు కోసం పోరాడారని గుర్తుచేశారు. ఆమరణదీక్ష చేపట్టిన పల్లా శ్రీనివాస్‌ను పరామర్శించిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 32 మంది ప్రాణాల త్యాగాలకు విలువలేదా అని చంద్రబాబు ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story