వైసీపీ నేతలు కొందరు రౌడీలు, గూండాల్లా తయారయ్యారు: చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు.. పట్టాభిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. దాడిని తీవ్రంగా ఖండించారు.. హైకోర్టు జడ్జి, సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉండే కాలనీలో ఇలాంటి దాడులు దారుణమన్నారు.. వైసీపీ నేతలు కొందరు రౌడీలు, గూండాల్లా తయారయ్యారన్నారు.. ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్నారనే పట్టాభిపై దాడి చేశారని చంద్రబాబు ఆరోపించారు.
రాష్ట్రంలో దాడులకు అంతే లేదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు చంద్రబాబు. దాడులను ఎండగడుతున్నారని ఇష్టానుసారం ప్రవర్తిస్తారా అంటూ ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఉన్మాదులుగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.. ఎంతమందిని చంపుతారో చంపండి.. చూస్తామంటూ చంద్రబాబు ఉద్వేంగంగా మాట్లాడారు.. ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండాలంటూ ప్రభుత్వానికి, వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ఇలాంటి ఘటనలే జరిగితే బట్టలిప్పి తరిమికొట్టే పరిస్థితి వస్తుందన్నారు చంద్రబాబు.
పట్టాభిపై దాడి ఘటనకు డీజీపీ గౌతమ్ సవాంగ్ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. నాడు దాడి చేసిన వారిని పట్టుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చుండేదా అని నిలదీశారు. మీకు జీతాలు ఇచ్చేది జగన్ కాదంటూ డీజీపీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. దాడులకు ఈ ప్రభుత్వం, పోలీసులు సిగ్గుపడాలన్నారు చంద్రబాబు. సంఘ విద్రోహ శక్తులను ప్రజలు సపోర్ట్ చేస్తే పట్టాభికి కాదు.. మీకు, మీ ఆడబిడ్డలకు రక్షణ ఉండదంటూ ప్రజలనుద్దేశించి చంద్రబాబు కామెంట్స్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com