Chandrababu Naidu : రఘురామకు ప్రభుత్వం నుంచి ప్రాణహాని: చంద్రబాబు

Chandrababu Naidu : రఘురామకు ప్రభుత్వం నుంచి  ప్రాణహాని: చంద్రబాబు
X
Chandrababu Naidu: ఎంపీ రఘురామకృష్ణరాజుకు ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ కి లేఖ రాశారు.

ఎంపీ రఘురామకృష్ణరాజుకు ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ కి లేఖ రాశారు. తనకు ప్రాణహాని ఉందని రఘురామ గతంలోనే చెప్పారని, దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకి వై కేటగిరి భద్రత కల్పించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తన గళాన్ని వినిపించినందుకు అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి హింసిస్తున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడలని కోరారు.అటు తన భర్తకి ప్రాణహాని ఉందని ఎంపీ రఘురామ భార్య రమ ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తకి ఏం జరిగినా దానికి ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, సీఐడీ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ మేరకు ఆమె ఒక వీడియోని తెలియజేశారు..

Tags

Next Story