సీనియర్‌ నేతలతో చంద్రబాబు సమావేశం

సీనియర్‌ నేతలతో చంద్రబాబు సమావేశం
పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన చంద్రబాబు

అందుబాటులో ఉన్న సీనియర్‌ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మల, మరికొందరు సీనియర్‌ నేతలు హాజరయ్యారు.. రేపట్నుంచి ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల వెరిఫికేషన్‌ కార్యక్రమం జరగనుంది.. ఈ నేపథ్యంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహంపై సీనియర్‌ నేతలతో చంద్రబాబు చర్చించారు. ఓటర్‌ వెరిఫికేషన్‌ నిర్వహించే బీఎల్‌వోల వెంట పార్టీ నేతలు వెళ్లాలని ఇప్పటికే టీడీపీ అధిష్ఠానం ఆదేశించింది.. రేపట్నుంచి నెలరోజులపాటు ఏపీలో ఓటర్‌ వెరిఫికేషన్ కార్యక్రమం జరగనుంది.. ఇప్పటికే ఓట్ల అవకతవకలు, టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపుపై టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రేపట్నుంచి జరిగే ఓటరు వెరిఫికేషన్‌ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story