చిన్నారి పాటకి చంద్రబాబు ఫిదా.. !

తెలుగుభాష గొప్పదనాన్ని వివరిస్తూ ఎంతో శ్రావ్యంగా పాడిన చిన్నారిపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అభినందనల వర్షం కురిపించారు. వీణియనాద వినోదంలా.. తేనియ మధురిమ సారంలా... మానిత కోకిల గానంలా.. మురిసె తెలుగు భాష' అంటూ అమరవాది రాజశేఖర్ శర్మ రచించిన పాటను ఆరో తరగతి చిన్నారి శ్రావ్యంగా ఆలపించింది. తరగతి గదిలో తోటి విద్యార్థుల ముందు పాడగావీడియో తీశారు.ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.
ఈ వీడియోను ట్వీట్ చేసిన చంద్రబాబు.. చిన్నారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. తెలుగు భాష గొప్పదనాన్ని వివరిస్తూ.. ఎంతో శ్రావ్యంగా గానం చేసిన ఈ ఆరో తరగతి చిన్నారిని మనసారా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ పాట సాహిత్యాన్ని వింటుంటే ప్రజలకు తెలుగు భాష మీద ఉన్న మమకారం స్పష్టమవుతోంది. అలాంటి తెలుగును పాలకులు కనుమరుగు చేయాలనుకోవడం ప్రజల అభీష్టానికి వ్యతిరేకం, దారుణం'' అని ట్వీట్ చేశారు చంద్రబాబు.
తెలుగు భాష గొప్పదనాన్ని వివరిస్తూ.. ఎంతో శ్రావ్యంగా గానం చేసిన ఈ 6వ తరగతి చిన్నారిని మనసారా అభినందిస్తున్నాను. ఈ పాట సాహిత్యాన్ని వింటుంటే ప్రజలకు తెలుగు భాష మీద ఉన్న మమకారం స్పష్టమవుతోంది. అలాంటి తెలుగును పాలకులు కనుమరుగు చేయాలనుకోవడం ప్రజల అభీష్టానికి వ్యతిరేకం.. దారుణం. pic.twitter.com/YgJvEBZtcA
— N Chandrababu Naidu (@ncbn) March 5, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com