chandrababu : ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ..!

Nara chandrababu Naidu (File Photo)
ఏపీ డీజీపీకి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. నెల్లూరు జిల్లాలో దాడికి గురైన ఎస్సీలపైనే అక్రమకేసులు పెట్టారంటూ లేఖలో పేర్కొన్నారు. కొడవలూరు మండలం కమ్మపాలంకు చెందిన కరాకట మల్లికార్జునపై నలుగురు వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని లేఖలో తెలిపారు. పోలీసులు మల్లికార్జునపైనే తప్పుడు కేసులు పెట్టారని, పైడేరు కాల్వాలో వైసీపీ నేతల మట్టిమాఫియాను ప్రశ్నించినందుకే మల్లికార్జునను వేధిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.
ఓ ఎస్సీ యువకుడిని వేధిచేందుకు పోలీసులు, వైసీపీ నేతలతో చేతులు కలపడం దుర్మార్గమన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ లేని విధంగా పోలీసుల చర్యలు ఉన్నాయన్నారు. అసలు నేరస్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మల్లికార్జునను తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిన కొడవలూరు పోలీసులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.
మల్లికార్జునపై దాడికి సంబంధించిన ఓ వీడియోను లేఖకు జతచేశారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com