ఏపీ సీఎస్‌కి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ.!

ఏపీ సీఎస్‌కి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ.!
X
కుప్పం రూరల్ ఎలక్ట్రిక్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌కి సంబంధించి విద్యుత్ పంపిణీ, రిటైల్ అమ్మకాలు, కార్యాకలాపాల వంటి అంశాలపై లేఖలో పేర్కొన్నారు.

ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం రూరల్ ఎలక్ట్రిక్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌కి సంబంధించి విద్యుత్ పంపిణీ, రిటైల్ అమ్మకాలు, కార్యాకలాపాల వంటి అంశాలపై లేఖలో పేర్కొన్నారు. రెస్కో కార్యకలాపాలను స్వాధీనం చేసుకోవాలని.. APSPDCLకు APER ఆదేశాలు జారీ చేసిందని.. రెస్కో స్వాధీనంపై APER ఆదేశాలు ప్రజాభీష్టానికి వ్యతిరేకమన్నారు చంద్రబాబు. కుప్పం రెస్కోను APSPDCL స్వాధీనం చేసుకునే ఏకపక్ష చర్య సరైన నిర్ణయం కాదన్నారు. 1981లో కుప్పం నియోజకవర్గంలో రెస్కో.. వెనుకబడిన, మారుమూల ప్రాంతాలలో 100శాతం గ్రామీణ విద్యుదీకరణ లక్ష్యంతో స్థాపించబడిందని తెలిపారు.

Tags

Next Story