రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ..

కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటిలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ నేతలు, పోలీసుల బెదరింపులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. మైదుకూరు టీడీపీ అభ్యర్ధులను ప్రచారం చేసుకోనీయకుండా అడ్డుకుంటూ పోలీసులు అక్రమకేసులు పెడుతున్నారంటూ ఫిర్యాదు తెలిపారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు, పోలీసులతో చేతులు కలిపి దుర్మార్గాలకు ఓడిగడుతున్నారన్నారు.
మైదుకూరు డీఎస్పీ బి విజయకుమార్, సీఐ మధుసూధన్‌గౌడ్, ఎస్సై సుబ్బారావులు టీడీపీ అభ్యర్ధులను, ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. వైసీపీకి అనుకూలంగా పోలీసులు, టీడీపీ అభ్యర్ధులకు ఫోన్లు చేసి బెరిస్తున్నారన్నారు. కమిషనర్, అసిస్టెంట్ ఎన్నికల అధికారి పీవీ రామకృష్ణ .... వైసీపీతో కుమ్మక్కై... మైదుకూరు 9వ డివిజన్ టీడీపీ అభ్యర్ధి జగన్మోహన్‌పై అక్రమకేసులు పెట్టారన్నారు.
టీడీపీ నేతలైనా మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి, మాజీ టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటసుబ్బారెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. క్రిమినల్, దొంగసారి, గంజాయి, అక్రమ ఎర్రచందన్ లాంటి కేసులు పెట్టి లోపల వేస్తామని తమ అభ్యర్ధులను బెదిరిస్తున్నారన్నారు. మైదకూరులో శాంతియువతంగా ఎన్నికలు జరగాలంటే.. ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్, పోలీసు అధికారులపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకవాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com