TDP: ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన టీడీపీ సీనియర్ నేతలు

TDP: ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన  టీడీపీ సీనియర్ నేతలు
ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల చేర్పులపై ఈసీకి ఫిర్యాదు

టీడీపీ సీనియర్ నేతలు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. రాష్ట్రంలో ఓటరు జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో యనమల రామకృష్ణుడు, కనకమేడల రవీంద్ర కుమార్, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లారు.

ఏపీలో పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని, అర్హులైన వారి ఓట్లు తొలగిస్తున్నారని ఈసీకి వివరించారు. టీడీపీ మద్దతుదారుల ఓట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గుతున్నారని, తప్పుడు ఓటర్ల జాబితాలు రూపొందిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నాయకుల రాజకీయ ఒత్తిళ్లతో తప్పుడు ఓటరు జాబితాను తయారు చేస్తూ ECI ఆదేశాలను DEOలు EROలు పాటించడం లేదని ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలను పరిశీలించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను రాష్ట్రానికి పంపాలని ఈసీని కోరింది టీడీపీ నేతల బృందం. అలాగే బీఎల్ఓగా ఉన్న గ్రామ వాలంటీర్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది.

ఏపీలో ఓట్ల తొలగింపు, బోగస్ ఓట్లు, వలంటీర్ వ్యవస్థ దుర్వినియోగం అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. దేశమంతా ఒక విధానం ఉంటే ఏపీలో ప్రత్యేక విధానం, వ్యవస్థ నడుస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయాన్ని ఎన్నికల వ్యవస్థలో ఉపయోగిస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.

దేశంలో ఎక్కడా ఇలా లేదన్నారు. కొత్త ఓట్ల నమోదు సహా అన్నీ వాలంటీర్ల చేతుల మీదుగా జరుగుతోందని ఆరోపణలు చేశారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని నాలుగు వేర్వేరు బూత్ లకు విడదీశారని అచ్చెన్నాయుడు చెప్పారు. చనిపోయిన వ్యక్తుల డెత్ సర్టిఫికెట్లు ఇచ్చినా ఓట్లు తొలగించలేదన్నారు. ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉన్నాయని ఆధారాలతో సహా చూపినా వాటిని కూడా తొలగించలేదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story