మంత్రి పెద్దిరెడ్డిపై గవర్నర్‌కు టీడీపీ ఫిర్యాదు!

మంత్రి పెద్దిరెడ్డిపై గవర్నర్‌కు టీడీపీ ఫిర్యాదు!
ఉద్యోగుల్ని ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలని ఫిర్యాదులో పేర్కొంది.

ఉద్యోగుల్ని ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలని ఫిర్యాదులో పేర్కొంది. రాజ్‌భవన్‌ చేరుకున్న టీడీపీ నేతలు బోండా ఉమ, వర్ల రామయ్య, బుద్దా వెంకన్న, అశోక్‌బాబు, మరెడ్డి శ్రీనివాసరెడ్డి, గద్దె రామ్మోహన్‌.... గవర్నర్‌ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్‌ కార్యదర్శికి ఫిర్యాదు అందించారు. గవర్నర్‌ కనీసం తమ ఫిర్యాదు కూడా తీసుకోవడానికి సమయం ఇవ్వడం లేదని టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తంచేశారు. తమకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంలో వరుసగా ఇలాగే జరుగుతోందని తెలిపారు.

Tags

Next Story