TDP: "రా... కదిలి రా..” పేరిట టీడీపీ ఎన్నికల ప్రచారం

TDP: రా... కదిలి రా..” పేరిట టీడీపీ ఎన్నికల ప్రచారం

తెలుగుదేశం పిలుస్తోంది రా..కదలిరా...అంటూ అన్న నందమూరి తారకరాముని పిలుపునకు యావత్‌ ఆంధ్రదేశం తన వెంట నడిచింది. ఇప్పుడు ఆ నినాదంతోనే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లేలా తెలుగుదేశం పార్టీ కార్యాచరణ రూపొందించింది. జగన్ పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లటమే లక్ష్యంగా నేటి నుంచి వరుస కార్యక్రమాలకు అధినేత చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ప్రజలకు స్వర్ణయుగం తెలుగుదేశంతోనే సాధ్యమనే వాదాన్ని బలంగా తీసుకెళ్లనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం పార్టీ నేడు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రాన్ని చీకటిమయం చేసి ఆంధ్రప్రదేశ్‌ని ఆందోళనప్రదేశ్ గా మార్చిన జగన్‌ పాలనకు చరమగీతం పాడదామంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు "రా కదలి రా!" పేరిట ఎన్నికల ప్రచార పర్వాన్ని ఉరకలెత్తించనున్నారు. నేటి నుంచి ఈ నెల 29 వరకు మొత్తం 22 పార్లమెంట్ స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. తొలి సభను నేడు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరిలో నిర్వహించనున్నారు. చిలకలూరు పేట, ధర్మవరం, విశాఖ పార్లమెంట్ పరిధిలో జరిగే బహిరంగ సభలకు పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సభలతో సంబంధం లేకుండా మేనిఫెస్టో ప్రకటన సభను ప్రత్యేకంగా నిర్వహించనున్నారు.


ఒక్కోసారి రోజుకు రెండేసి బహిరంగ సభల్లో పాల్గొనాల్సిఉన్నందున చంద్రబాబు హెలికాఫ్టర్‌ను వినియోగించనున్నారు. ఇందుకు ఉండవల్లిలోని నివాసం వద్ద హెలీప్యాడ్‌ ను పునరుద్ధరించారు. రెండో బహిరంగ సభను 7తేదీన విజయవాడ పార్లమెంట్ పరిధిలోని తిరువూరు, నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని ఆచంటలో నిర్వహిస్తారు. 9న వెంకటగిరి, ఆళ్లగడ్డ సభల్లో పాల్గొంటారు. 10న బొబ్బిలి, తుని బహిరంగ సభలకు చంద్రబాబు హాజరవుతారు. 18న NTR వర్థంతి సందర్భంగా గుడివాడలో భారీ సభ నిర్వహించనున్నారు. చివరిగా ఈనెల 29న ఉంగుటూరు, చీరాలలోబహిరంగ సభలు నిర్వహించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story