ప్రజలు వైసీపీని బంగాళాఖాతంలోకి తోస్తారు: కోవెలమూడి

ప్రజలు వైసీపీని బంగాళాఖాతంలోకి తోస్తారు: కోవెలమూడి
గతంలో కరంటు తీగలు పట్టుకుంటే షాక్ కొట్టేది కానీ నేడు కరెంట్ బిల్లులు పట్టుకుంటే షాక్‌లు

విద్యుత్ చార్జీల మోత పై గుంటూరు పశ్చిమ ఇంచార్జ్ కోవెలమూడి రవీంద్ర మీడియాతో మాట్లాడారు. గతంలో కరంటు తీగలు పట్టుకుంటే షాక్ కొట్టేది కానీ నేడు కరెంట్ బిల్లులు పట్టుకుంటే షాక్‌లు కొడుతున్నాయన్నారు.పేదవాడి నడ్డివిరగగొట్టడానికి వైసీపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీల మోత మోగిస్తోందన్నారు. ఇప్పటికే7సార్లు విద్యుత్ చార్జీల పెంపు చేసి ప్రజలను నయవంచన చేసిన ఘనుడు సీఎం జగన్‌ అని విమర్శించారు.

శిరిడి సాయి సంస్థ పేరుతో రైతుల పొలాలకు మీటర్లు బిగించి అధిక డబ్బులు వసూలు చేయడానికి మంత్రి పెద్ది రెడ్డి అనుయాయులను బాగుచేయడానికేనా అంటూ ప్రశ్నించారు. అవినీతి, బినామీ కంపనిలతో కోట్లరూపాయలు తాడేపల్లి కోటకు తరలిస్తున్నారని ఆరోపించారు. సర్ చార్జీలు, ట్రూ చార్జీల పేరుతో వైసీపీ ప్రభుత్వం పేదలను సర్వనాశనం చేస్తుందన్నారు. మద్యం సిండికేట్ అయ్యి ప్రజల రక్తాన్ని తగుతున్నారని మండిపడ్డారు.

రాబోయే రోజుల్లో పేదవాడు కూడా ఈ వి ఎమ్ లో బటన్స్ నొక్కి వైసీపీ ప్రభుత్వానికి చరమ గీతం పాడుతారని జ్యోస్యం చెప్పారు. అలాగే పేదవాడు తలుచుకుంటే ఈ వి ఎమ్ బటన్ నొక్కితే వైసీపీ వెళ్లి బంగాళాఖాతంలో పడటం ఖాయమని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినది మొదలు ప్రజలపై పన్నుల బాదుడు మొదలు పెట్టి నేడు రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాడు, వైసీపీ ప్రభుత్వం ప్రజల నడ్డివిరగగొట్టడానికి వచ్చిందా అని ఆవేదన వ్యక్తంచేశారు.

Tags

Read MoreRead Less
Next Story