TDP:కల్యాణదుర్గం టీడీపీ కైవసం

TDP:కల్యాణదుర్గం టీడీపీ కైవసం
X
కల్యాణదుర్గం మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి టీడీపీ కైవసం

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. తలారి గౌతమి కొత్త ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. మొత్తం 24 మంది కౌన్సిలర్లలో.. టీడీపీకి 14 మంది, వైసీపీకి 11 మంది కౌన్సిలర్స్ మద్దతు ఇచ్చారు. ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు హాజరుకాలేదు. దీంతో తలారి గౌతమి ఎన్నిక నల్లేరు మీద నడక అయ్యింది.

మొదలైన కడప మేయర్ ఎన్నిక

కడప మేయర్ ఎన్నిక మొదలైంది. వైసీపీకి చెందిన 38 మంది కార్పొరేటర్లు, ఒక ఇండిపెండెంట్, ఒక ఎమ్మెల్సీ ఎన్నికకు హాజరయ్యారు. వైసీపీ మేయర్ అభ్యర్థిగా 47వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప కార్పొరేషన్‌ పాలకమండలిలో మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు.

Tags

Next Story