TDP: టీడీపీలో పదవుల జాతర ?

టీడీపీ లో పదవుల జాతర ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో, మే నెలాఖరులోగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. కూటమి సర్కారులో 705 పదవులను భర్తీ చేసినట్లు ప్రకటించారు. మొదటి, రెండో విడతలలో 150 మందికి పదవులు కేటాయించగా, మూడో విడతలో 47 మార్కెట్ కమిటీల ఛైర్మన్లు నియమించారు. పదవుల కోసం టీడీపీలో పెద్ద సంఖ్యలో ఆశావహులు పోటీపడుతున్నారని సమాచారం. దాదాపు 60,000 అప్లికేషన్లు వచ్చినట్లు తెలిసింది. జనసేన, బీజేపీ కూడా మరిన్ని పోస్టులు అడుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, చంద్రబాబు అందరికీ న్యాయం చేస్తానని చెప్పారు.
ఒకవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ విడతలవారీగా సాగుతుండగా మరోవైపు పార్టీలోనూ పదవుల భర్తీ ప్రక్రియను చేపట్టేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమైంది. ఇప్పటికే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. క్షేత్రస్థాయిలోని కుటుంబ సాధికార సారథులు మొదలు.. లోక్‌సభ నియోజకవర్గస్థాయి వరకు అన్ని కమిటీలు, అనుబంధ కమిటీల ఎన్నికల ప్రక్రియను వచ్చే నెల మే 15లోగా పూర్తి చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎన్నికల షెడ్యూల్ సైతం ప్రకటించారు.
రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు, అమలాపురం లో జరిగిన ప్రెస్ మీట్‌లో కీలక ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం పనిచేస్తానని ప్రకటించారు. సమాజం స్థితిగతులను అవగాహన చేసుకుని, తప్పులను సరిదిద్దడమే తన లక్ష్యమని చెప్పారు. జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఆయనను "పొంచి ఉన్న అతిపెద్ద ఉపద్రవం" గా పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలకు గౌరవం లేకుండా, అవినీతి, అరాచకాలు జరిపిన జగన్‌ను "మోసగాడు" అని విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com