అన్నం పెట్టిన కాంగ్రెస్‌కు పది వెన్నుపోట్లు పొడిచింది వైసీపీ : బోండా ఉమ

అన్నం పెట్టిన కాంగ్రెస్‌కు పది వెన్నుపోట్లు పొడిచింది వైసీపీ : బోండా ఉమ
అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా చంద్రబాబు అని.. వాటికి కేరాఫ్ అడ్రస్‌ టీడీపీ అన్నారు..

అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా చంద్రబాబు అని.. వాటికి కేరాఫ్ అడ్రస్‌ టీడీపీ అన్నారు ఆ పార్టీ నేత బొండా ఉమ. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిని ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధమన్నారు. అన్నం పెట్టిన కాంగ్రెస్‌కు, సోనియాగాంధీకి ఒకటికి పది వెన్నుపోట్లు పొడిచింది వైసీపీ కాదా అని ప్రశ్నించారు. కళ్లకు కట్టినట్టు నిర్మాణాలు కనిపిస్తుంటే గ్రాఫిక్స్‌ అంటూ విషప్రచారం చేస్తారా అని మండిపడ్డారు. 15 నెలల్లో పోలవరం సహా, రాష్ట్రంలో ఎక్కడా వీసమెత్తు పనిచేయని వైసీపీ ప్రభుత్వం, అబద్ధాలతో కాలం గడుపుతోందని ఆరోపించారు.

Tags

Next Story