Chintakayala Vijay : టీడీపీ నేత చింతకాయల విజయ్‌కు సీఐడీ నోటీసులు..

Chintakayala Vijay : టీడీపీ నేత చింతకాయల విజయ్‌కు సీఐడీ నోటీసులు..
X
Chintakayala Vijay : టీడీపీ నేత చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ పోలీసులు వచ్చారు

Chintakayala Vijay : టీడీపీ నేత చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ పోలీసులు వచ్చారు. విజయ్ ఇంట్లో లేకపోవడంతో డ్రైవర్‌పై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. చింతకాయల విజయ్ ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారో, కేసు వివరాలేంటో మాత్రం చెప్పలేదు. విజయ్‌ ఇంటికి వచ్చిన పది మంది పోలీసులు.. దౌర్జన్యంగా వ్యవహరించారంటూ అక్కడి సిబ్బంది చెబుతున్నారు.

సీఐడీ పోలీసులు చింతకాయల విజయ్‌ ఇంట్లో నోటీసు ఇచ్చి వెళ్లిపోయారు. ఈ నెల 6న మంగళగిరి సైబర్‌ క్రైమ్‌ ఆఫీస్‌లో హాజరు కావాలన్నారు. విచారణకు విజయ్‌ తన ఫోన్లు తీసుకురావాలన్న సీఐడీ పోలీసులు.. విచారణ అధికారి ముందు ఆ ఫోన్‌ జమ చేయాలని స్పష్టం చేశారు.

Tags

Next Story