SEC కి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన నేపథ్యంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య SEC కి లేఖ రాశారు. మార్చి 2020లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అవలంబించిన అప్రజాస్వామిక హింసాత్మక విధానాలను దృష్టిలో ఉంచుకుని ఆ విషయాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వస్తున్నానని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని కొంత మంది పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై టీడీపీ నాయకులు ,కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారని అన్నారు.
గత మార్చిలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధులు.. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎన్నికల అధికారులు సహకరించలేదని లేఖలో తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ప్రతిపక్ష పార్టీ అభ్యర్ధులపై వైసీపీ గూండాలు హింసాత్మక దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. అధికార పార్టీ అభ్యర్ధులకు ఓ ఓటరు లిస్ట్ ,ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధులకు వేరొక ఓటరు లిస్టు ఇచ్చి ఎన్నికల అధికారులు అనేక అవకతవకలకు పాల్పడ్డారని లేఖ ద్వారా SECకి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com