ఏపీలో దేవాలయాల దాడులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపై దాడుల విషయంలో CBI దర్యాప్తు జరపాలని గవర్నర్‌ను కోరారు టీడీపీ నేతలు. ఏపీలో ఇప్పటికే 140 దేవాలయాలపై దాడులు జరిగినట్టు గుర్తించామని, ఆ పూర్తి వివరాలను గవర్నర్‌ను అందజేశారు టీడీపీ నేతలు. రాష్ట్రంలో మతపరమైన హక్కులు కల్పించే ఆర్టికల్ 25, 26 అమలు అవ్వడం లేదని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా సీఎం నిమ్మకు నీరెత్తునట్లు ఉన్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే దాడులు ఆగేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు.
రాష్ట్ర వ్యాప్తంగా 140 చోట్ల దాడులు జరిగితే ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయాలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర. ఇంత జరుగుతున్నా మంత్రులు వ్యాఖ్యలు మాత్రం దారుణంగా ఉన్నాయి అన్నారు. వారి వ్యాఖ్యలు విద్రోహ చర్యలకు పురిగొల్పేలా ఉన్నాయని మండిపడ్డారు. రామతీర్ధం చరిత్ర ఏంటో ప్రభుత్వం ముందు తెలుసుకోవాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com