ఆంధ్రప్రదేశ్

Eluru: ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ నాయకులు.. అనుమతి లేదంటూ..

Eluru: ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం.. పెదపాడు గ్రామంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు వివాదానికి దారితీసింది.

Eluru: ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ నాయకులు.. అనుమతి లేదంటూ..
X

Eluru: ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం.. పెదపాడు గ్రామంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు వివాదానికి దారితీసింది. ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరినా.. పర్మిషన్‌ రాలేదు. దీంతో టీడీపీ నాయకులు గ్రామంలో విగ్రహాన్ని 2 రోజుల క్రితం నెలకొల్పారు. అయితే తాజాగా విగ్రహ ఏర్పాటుకు పర్మిషన్‌ లేదంటూ.. దానిని తొలగించేందుకు అధికారులు అక్కడికి చేరుకోగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనుమతులు కోరినా కావాలనే ఇవ్వడం లేదని.. విగ్రహాన్ని తొలగిస్తే ఊరుకోమని స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో ఈనెల 28లోగా అనుమతులు తెచ్చుకోవాలని, అప్పటి వరకు విగ్రహానికి ముసుగు వేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES