mahanadu: మహానాడులో నోరూరించే వంటకాలు

mahanadu: మహానాడులో నోరూరించే వంటకాలు
X
వెజ్, నాన్ వెజ్ వంటకాలు సిద్ధం... భోజనం ప్లేటులో 20 రకాలు

తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగ మహానాడు ఆరంభమైంది. కడప గడప మొత్తం పసుపు మయమైంది. ఎటు చూసినా పసుపు జెండాలు, పచ్చని తోరణాలతో పండుగ వాతావరణం కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు కావడంతో టీడీపీ ఘనంగా నిర్వహిస్తోంది. మహానాడు కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు. ఈ మహానాడు కోసం టీడీపీ వెజ్, నాన్‌వెజ్‌ వంటకాలతో మెనూను సిద్ధం చేశారు. ఏపీమంత్రి బీసీ జనార్థన్ రెడ్డికి ఈ భోజన ఏర్పాట్ల బాధ్యతల్ని అప్పగించారు.. అలాగే ఈ కమిటీలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఎస్‌.సవితలు ఉన్నారు. మహానాడు ఫుడ్ మెనూపై చింతమనేని క్లారిటీ ఇచ్చారు. నోరూరించే వంటకాలను లిస్ట్‌లో చేర్చారు. 2 లక్షలమందికి భోజన ఏర్పాటు చేసినట్లు చింతమనేని తెలిపారు. మొదటి రోజు తాపేశ్వరం కాజా, గోంగూర చికెన్, వెజిటబుల్ బిర్యానీ మెయిన్ ఐటెమ్స్ సిద్ధం చేస్తున్నారు. రెండో రోజు అల్లూరయ్య మైసూర్ పాక్, బిర్యానీ, దోసకాయ మటన్, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ఉంటుందని.. మూడో రోజు బగారా రైస్, చికెన్ కర్రీతో మెనూ ఉంటుందన్నారు. మహానాడులో వెజ్, నాన్‌వెజ్ వంటకాలు కలిపి ఉంటాయని.. వెజ్‌లో కొన్ని కూరలు, సాంబారు, రసం వంటివి ఉంటాయన్నారు. ఈసారి ఆవకాయ కూడా స్పెషల్.. దెందలూరు నుంచి మామిడికాయలు తీసుకొచ్చానని చెప్పారు. మహానాడు ప్రాంగణంలో అన్ని వైపులా ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేశారు. దాదాపు మూడు లక్షల మందికి భోజనాలు అందజేసేందుకు ప్లాన్ చేశారు. మూడు రోజుల పాటూ భోజనాల్లో 20 రకాల వంటకాలకు తగ్గకుండా వడ్డించనున్నారు. 1,700 మంది వంటవారు.. మరో 800 మందిని వడ్డిస్తారు.

ఉదయం టిఫిన్ మెనూ

పొంగలి, ఇడ్లీ, టమాటా బాత్, టూటీఫ్రూటీ కేసరి, కాఫీ, టీ

మధ్యాహ్న భోజనం మెనూ

నాన్‌వెజ్: గోంగూర చికెన్, ఆంధ్రా స్టైల్‌ చికెన్‌కర్రీ, ఎగ్‌ రోస్ట్, రోటి పచ్చడి, తెల్లన్నం, ప్లెయిన్‌ బిర్యానీ, సాంబారు, ఉలవచారు, మామిడికాయ పచ్చడి, పెరుగు

వెజ్‌: తెల్లన్నం, గోంగూర పూల్‌ మఖానా, ప్లెయిన్‌ బిర్యానీ, టమాటా పప్పు, రోటి పచ్చడి, పెరుగు, చిప్స్, ములక్కాయ టమాటా గ్రేవీ, బెండకాయ బూందీ

సాయంత్రం స్నాక్స్‌ మెనూ

కాఫీ, టీతో పాటు కార్న్‌ సమోసా, బిస్కెట్లు, పకోడీ, మిర్చి బజ్జీలు

రాత్రి భోజనం మెనూ

రైస్‌తోపాటు వంకాయ బఠాణీ, ఆలూ ఫ్రై, పెసరపప్పు చారు, రోటి పచ్చడి, పెరుగు

Tags

Next Story