పసుపుమయంగా రాజమండ్రి

పసుపుమయంగా రాజమండ్రి
ఎటు చూసిన జనప్రభంజనమే కన్పించింది. ఇక మహానాడులో తొలిరోజు ప్రతినిధుల సభ నిర్వహించారు

రాజమండ్రి పసుపుమయంగా మారిపోయింది. మహానాడు జనసునామీని తలపించింది. ఎటు చూసిన జనప్రభంజనమే కన్పించింది. ఇక మహానాడులో తొలిరోజు ప్రతినిధుల సభ నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి మహానాడును ప్రారంభించి పార్టీ జెండా ఆవిష్కరించారు. మహానాడు ప్రాంగణమంతా కార్యకర్తలు, అభిమానుల రాకతో కళకళలాడింది. మరోవైపు సుమారు 15వందల మంది ప్రతినిధులు మహానాడులో సంతకాలు చేశారు. తొలి రోజు మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇవాళ సుమారు 15లక్షల మంది మహానాడుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.

ఇక ఇవాళ మహానాడు వేదికగా కీలక కార్యక్రమాలు జరగనున్నాయి. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. ఇప్పటికే వాడవాడల కార్యక్రమాలు నిర్వహించేలా టీడీపీ ప్లాన్ చేసింది. మరోవైపు టీడీపీ తొలి మ్యానిఫెస్టోను ప్రకటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సంక్షేమం, అభివృద్ధి.. ఇదే స్ఫూర్తితో మ్యానిఫెస్టో తీసుకొస్తామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇక మహానాడు వేదికగా పలు తీర్మానాలను ప్రకటించనుననారు. మరోవైపు మహానాడులో గోదావరి జిల్లాల ఆతిథ్యం అద్భుతంగా ఉంది. నోరూరించే వంటకాలను తెలుగు తమ్ముళ్లకు రుచి చూపిస్తున్నారు గోదావరి జిల్లాల టీడీపీ నేతలు.

Tags

Read MoreRead Less
Next Story