విజయసాయిరెడ్డే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు బాధ్యుడు : బుద్ధా వెంకన్న
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ముఖ్య సూత్రధారి విజయసాయిరెడ్డేనని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ముఖ్య సూత్రధారి విజయసాయిరెడ్డేనని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. విశాఖ ఉక్కు కోసం విజయసాయిరెడ్డి 25 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే... ఆగేది ట్రాఫిక్ జామ్ తప్ప... ఏమీ ఉండదన్నారు. సాయిరెడ్డిది పాదయాత్ర కాదు వాకింగ్ మాత్రమే అన్నారు బుద్ధా వెంకన్న. వైసీపీ ఎంపీలు మొత్తం రాజీనామా చేసి స్పీకర్‌కు పంపాలి లేదా... ఆంధ్రభవన్ నుంచి పార్లమెంట్ భవన్ వరకు.. లేదా మోదీ ఇంటి వరకు పాదయాత్ర చేస్తే కేంద్రానికి వినబడుతుందన్నారు. అంతేకానీ.. విశాఖలో పాదయాత్ర చేస్తే జిల్లా దాటదన్నారు.
Next Story