ఆంధ్రప్రదేశ్‌పై బీజేపీ సవతితల్లి ప్రేమ చూపిస్తోంది: టీడీపీ సీనియర్‌ నేత నిమ్మల రామానాయుడు

ఆంధ్రప్రదేశ్‌పై బీజేపీ సవతితల్లి ప్రేమ చూపిస్తోంది: టీడీపీ సీనియర్‌ నేత నిమ్మల రామానాయుడు
టీడీపీ సీనియర్‌ నేత నిమ్మల రామానాయుడు

ఆంధ్రప్రదేశ్‌పై బీజేపీ సవతితల్లి ప్రేమ చూపిస్తోందని టీడీపీ సీనియర్‌ నేత నిమ్మల రామానాయుడు అన్నారు. పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల్లో ప్రచారం చేస్తోన్న బీజీపీకి ఎపి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రత్నప్రభ బీజేపీ అభ్యర్ధి అని ఎవరూ అనుకోవడంలేదని.. రత్నప్రభను జనసేన కార్యకర్తలు వైసీపీ అభ్యర్ధిగానే భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.

రేపటి ఉప పోరులో జన సైనికులు టీడీపీకి ఓట్లు వేయబోతున్నారని నిమ్మల జోస్యం చెప్పారు. జనసేన కార్యకర్తలకు బీజేపీ నిలబెట్టిన రత్నప్రభకు ఓటు వేయడం ఇష్టం లేదని అన్నారు. వైసీపీకి 5 లక్షల మెజారిటీ వస్తుందని చెప్పిన సిఎం .. తిరుపతి ప్రచారానికి వస్తున్నారంటే టీడీపీని చూసి భయపడుతున్నారని అర్ధమవుతోందని నిమ్మల రామానాయుడు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story