టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి కన్నుమూత..!
టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మృతి చెందారు.

టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల టీడీపీ నాయకులు సంతాపం తెలుపుతున్నారు. సబ్బం హరికి భార్య లక్ష్మి ముగ్గురు పిల్లలున్నారు. కాగా సబ్బం హరికి ఈనెల 15న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
Next Story