23 Dec 2020 1:32 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / పేదలకు ఇళ్ల...

పేదలకు ఇళ్ల పట్టాభిషేకం కాదు.. వైసీపీ నేతలకు కనకాభిషేకం: పట్టాభి

పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ నేతలు దోచుకు తింటున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. పేదలకు ఇచ్చే సెంటు భూమిలోనూ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించారు.

పేదలకు ఇళ్ల పట్టాభిషేకం కాదు.. వైసీపీ నేతలకు కనకాభిషేకం: పట్టాభి
X

పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ నేతలు దోచుకు తింటున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. పేదలకు ఇచ్చే సెంటు భూమిలోనూ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో ఏ వైసీపీ నాయకుడు ఎక్కడెక్కడ ఎంతెంత దోచుకున్నారో ఆధారాలతో సహా బయటపెట్టారు. ప్రజాధనాన్ని దోచుకోవడంలో వైసీపీ నాయకులు ఒకరిని మించి ఒకరు పోటీపడ్డారని అన్నారు. పేదలకు ఇళ్ల పట్టాభిషేకమని ముఖ్యమంత్రి జగన్‌ చెబుతున్నారని.. కానీ, ఇది వైసీపీ నేతలకు కనకాభిషేకమని పట్టాభి ఎద్దేవా చేశారు. రేపు మరిన్ని ఆధారాలతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు పట్టాభి చెప్పారు.

Next Story