చింతలపూడిలో సెల్ఫీ ఛాలెంజ్ విసిరిన చంద్రబాబు

ప్రాజెక్ట్‌ల పరిశీలనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు పరిశీలించారు.. రెండు జిల్లాల పరిధిలో దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగునీరందించే లిఫ్ట్ ఇరిగేషన్‌ను వైసీపీ ప్రభుత్వం అటకెక్కించిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రాజెక్ట్‌ను పరిశీలించిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వానికి సెల్ఫీ చాలెంజ్ విసిరారు..
ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాల పరిధిలో 4 లక్షల 80 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం.. చింతలపూడి లిఫ్ట్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. గోదావరి నుంచి 53 టీఎంసీల వరద జలాలను తరలించే లక్ష్యంలో భాగంగా 2వేల 289 కోట్లతో పనులు కూడా చేసింది. అయితే ప్రభుత్వం మారడంతో ఈ ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టుకుంది.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక చింతలపూడి ప్రాజెక్ట్ పూర్తిగా పడకేసింది. టీడీపీ నేతలతో కలిసి ప్రాజెక్ట్‌ను పరిశీలించిన చంద్రబాబు.. చింతలపూడిని ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.. కార్యక్రమంలో టీడీపీ నేతలు దేవినేని ఉమ, పితాని, గోరంట్ల బుచ్చయ్య, జవహర్ పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com