TDP: క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై టీడీపీ దృష్టి

తెలుగు తమ్ముళ్లు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న టీడీపీ కొత్త జిల్లా అధ్యక్షుల జాబితా ఎట్టకేలకు విడుదలైంది. గ్రామ, మండల, జిల్లాల వారీగా కమిటీల నియామకం పూర్తైనప్పటికీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల ఎంపిక మాత్రం గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల పేర్లు ఖరారయ్యాయి. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా టీడీపీ జిల్లా అధ్యక్షుల పేర్లను, ప్రధాన కార్యదర్శులను ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ జాబితాకు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఆమోదం తెలిపారు. దీంతో టీడీపీ అధిష్టానం కొత్త జిల్లా అధ్యక్షుల పేర్లను అధికారికంగా ప్రకటించింది.
టీడీపీ లోక్‌సభ నియోజకవర్గ (జిల్లా) అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల జాబితాను పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. వివిధ సామాజిక సమీకరణాలు, సామర్థ్యం, సీనియారిటీ, విధేయత, అనుభవం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని చంద్రబాబు ఈ ఎంపికలు చేశారు. త్రీమెన్ కమిటీల నుంచి తెప్పించుకున్న నివేదికలను పరిశీలించిన అనంతరం ఈ పేర్లను ఖరారు చేశారు. సీనియారిటీ, అనుభవం, విధేయతతో పాటు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ కొత్త జిల్లా అధ్యక్షులను చంద్రబాబు ఎంపిక చేశారు.
జిల్లా అధ్యక్షుల నియామకం కోసం టీడీపీ అధిష్టానం త్రీమెన్ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యకర్తలు, నేతల అభిప్రాయాలను సేకరించాయి. అనంతరం పార్టీ అధిష్టానానికి నివేదికలు సమర్పించాయి. ఈ నివేదికలపై ఇటీవల చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. నివేదికలను పరిశీలించిన అనంతరం జిల్లా అధ్యక్షుల ఎంపికపై చంద్రబాబు ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలిసింది. ఇటీవలే కొంతమందికి ఫోన్లు చేసి ఈ విషయాన్ని తెలియజేశారంటూ వార్తలు కూడా వచ్చాయి. అలాగే ఒక జాబితా సోషల్ మీడియా, ప్రధాన మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే అప్పటివరకు టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో సస్పెన్స్ కొనసాగింది. ఇప్పుడు ఆ సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లా అధ్యక్షులను టీడీపీ అధికారికంగా ప్రకటించింది.
సామాజిక వర్గ సమీకరణాలు, పార్టీ పట్ల విధేయత, సామర్థ్యం, అనుభవం వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం చంద్రబాబు నాయుడు ఈ జాబితాను ఖరారు చేసినట్లు సమాచారం. మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

