8 Dec 2020 10:02 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ఏలూరు ఘటనపై జాతీయ మానవ...

ఏలూరు ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి టీడీపీ ఫిర్యాదు

ఏలూరు ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి టీడీపీ ఫిర్యాదు
X

ఏలూరు ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం లేఖ రాశారు. పరిశుభ్రమైన నీరు పొందడం మానవహక్కని.. దాన్ని ప్రజలకు అందించడం ప్రభుత్వ కనీస బాధ్యతని.. NHRCకి రాసిన లేఖలో పట్టాభి పేర్కొన్నారు. ఏలూరులో పారిశుద్ధ్యం లోపించి తాగు నీరు కలుషితమైనట్టు తెలుస్తోందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని NHRCకి నివేదించారు.



Next Story