Nellore : విద్యార్థిని చితకబాదిన టీచర్

Nellore : విద్యార్థిని చితకబాదిన టీచర్
X

నెల్లూరు జిల్లా కలువాయి ప్రవైట్ స్కూల్ లో యూకేజీ చదువుతున్న విష్ణు నీ స్కూల్ టీచర్ చితక బాదింది. ప్రైవేట్ స్కూల్ నుంచి స్కూల్ బస్సులో సోమశిల లోని తన ఇంటికి వెళ్లగా తల్లి బిడ్డకు స్నానం చేపిస్తామని బట్టలు విప్పతీస్తుండగా ఒంటిమీద దెబ్బలు చూసి భయాందోళనకు గురైంది. ఏం జరిగిందని విష్ణువుని తల్లి అడగగా తన క్లాస్ టీచర్ శ్రావణి ఇష్టానుసారంగా కొట్టిందని బోరున విలపించాడు. ఈ విషయంపై ఆగ్రహించిన విష్ణు తండ్రి వరప్రసాద్ వారి బంధువులు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల విద్యాశాఖ అధికారులు కు కూడా విష్ణు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కర్కోటకంగా చిన్న బిడ్డను దారుణంగా కొట్టడం పట్ల స్థానికుల సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Next Story