Eluru : అనుమానాస్పద స్థితిలో టీచర్ మృతి

Eluru : అనుమానాస్పద స్థితిలో టీచర్ మృతి
X

ఏలూరు నగర శివారు ప్రాంతమైన చోదిమెళ్లలో ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న మందాడ దేవిక (35) ఆదివారం తెల్లవారుజామున ఆమె నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె భర్త కాళ్లు, చేతులకు బ్లేడ్ తో కట్ చేసిన గాయాలు ఉండగా.. రక్తపు మడుగులో పడి ఉన్నారు. వారిని గుర్తించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారమిచ్చారు. కాగా.. భర్త సురేంద్ర కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగానే పనిచేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపాడు మండలం రాయగూడానికి చెందిన దేవికతో సురేంద్రకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతులిద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులే. సురేంద్రకు దేవికకు కుటుంబ కలహాలు కారణమా? వృత్తి పరమైన సమస్యలా? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దేవిక మృతదేహాన్ని సర్వజన ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన రూరల్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags

Next Story