TDP: జగన్‌పై దాడి ఓ స్టేజ్ డ్రామా

సీఎం జగన్ పై రాయి దాడి స్టేజ్ డ్రామా అని తెలుగుదేశం నేత వర్ల రామయ్య విమర్శించారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని బీజేపీ,జనసేన నేతలతో కలిసి ఆయనఏపీ ఎన్ని కల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు ఖాయమని తెలిసే గులకరాయితో డ్రామా ఆడారన్న రామయ్య..దాడి జరిగే ముందే కరెంటు పోవటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈసారి కూడా సానుభూతితో ఎన్నికల్లో గెలవాలని జగన్ చూస్తున్నారని.. ఆరోపించారు. రాయి దాడి డ్రామా మెుత్తం బయటపడాలంటే CBIదర్యాప్తు జరిపించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
మరోవైపు సీఎం జగన్ పై రాయి దాడి ఘటనపై... కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. వీఐపీల భద్రత విషయంలో వరుస వైఫల్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చిలకలూరిపేట సమీపంలో ప్రధాని సభ, సీఎం రోడ్ షోలో భద్రతా వైఫల్యాలేంటని ప్రశ్నలు సంధించింది. ముఖ్యమంత్రి గాయపడిన ఘటనపై విజయవాడ సీపీ నుంచి సమగ్ర నివేదిక తీసుకోవాలని CEOను ఆదేశించింది. ఏపీలోనే ఉన్న ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు దీపక్ మిశ్రా నుంచి కూడా ఈసీ నివేదిక కోరినట్టు తెలుస్తోంది.సీఎంపై దాడి నేపథ్యంలో రాజకీయ హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రధాని సభలో..... భద్రతా వైఫల్యంపై ఇప్పటికే ఐజీ పాలరాజు, పలనాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై.... ఈసీ బదిలీ వేటు వేసింది. మరోవైపు సీఎం జగన్ రోడ్ షోలో భద్రతా వైఫల్యాలపై.. బెజవాడ సీపీ సహా మరికొందరు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.
మరోవైపు విజయవాడ రోడ్ షోలో సీఎం జగన్ పై రాయితో జరిగిన దాడి ఘటనపై పోలీసులు FIR నమోదు చేశారు. MLAవెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఏ సెక్షన్లతో కేసు నమోదు చేశారనే విషయాలను మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి అజిత్ సింగ్ నగర్ పోలీసులు ఫిర్యాదు, స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. మరోవైపు ఈ కేసును దర్యాప్తు చేసేందుకు 20మంది పోలీసులతో..... 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలం పరిసర ప్రాంతాలను డ్రోన్ తో చిత్రీకరించారు. సీసీటీవీ ఫుటేజీ విజువల్స్ ను సేకరించారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతోంది.జగన్ పై దాడి ఘటనపై ఇప్పటికే విజయవాడ సీపీ క్రాంతి రాణా... ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు.
మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ‘వారాహి యాత్ర’లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం సాయంత్రం యాత్ర కొనసాగుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తి పవన్‌పై రాయి విసిరాడు. అయితే, రాయి ఆయనకు తగలకుండా.. సమీపంలో పడింది. వెంటనే అప్రమత్తమైన జనసేన కార్యకర్తలు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com