Tirupati : తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత ..!

Tirupati : తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత ..!
Tirupati : తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్ల రుబాబుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

Tirupati : తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్ల రుబాబుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర అంబులెన్స్‌లను రానివ్వకపోవడంపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. రుయా ఆస్పత్రి వద్ద బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. విచారణకు వచ్చిన అధికారుల కారును అడ్డగించారు. కారు ఎదురుగా బైటాయించి నిరసన తెలిపారు. ఆస్పత్రి వద్ద ఇంతటి దారుణాలు జరుగుతుంటే పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు. తక్షణం ముఖ్యమంత్రి స్పందించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన తమపై ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్లు దాడి చేశారని బాధితుడు నందకిషోర్‌ వాపోతున్నాడు. తమను విచక్షణారహితంగా చితకబాదారని అంటున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని... ప్రైవేట్‌ సిండికెట్‌ను అడ్డుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇటు మరోవైపు బాధితుడి ఫిర్యాదుపై పోలీసులు విచారిస్తున్నారు. కలెక్టర్‌ ఆదేశాలతో ఆర్డీవో, డీఎస్పీతో విచారణ కమిటీ నియమించారు. ఇలాంటి ఘటన ఇదివరకే జరిగిందని... ఆనాడు చర్యలు తీసుకున్నా... మళ్లీ పునరావృతమైందంటున్నారు డీఎస్పీ. నిందితులపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. హాస్పిటల్‌లో అంబులెన్స్‌ల క్రమబద్దీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆర్డీవో అంటున్నారు.

రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన బాలుడు మరణించాడు. బాలుడి మృతదేహాన్ని తరలించేందుకు ఆసుపత్రి వద్దకు బంధువులు అంబులెన్స్ పంపించారు. అయితే ఆసుపత్రి వద్ద ఉన్న ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు బాలుడి మృతదేహాన్ని తరలించడాన్ని అడ్డుకున్నారు. బాలుడి తండ్రి ప్రాధేయపడినా.. వినలేదు. తమ అంబులెన్స్‌లోనే మృతదేహాన్ని తరలించాలంటూ రుబాబు చేశారు.

20 వేలు కట్టి తమ అంబులెన్స్ లోనే తరలించాలని డిమాండ్ చేశారు. అంతటి ఆగకుండా... అక్కడికి వచ్చిన మరో అంబులెన్స్‌ సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. దీంతో చేసేదేమి లేక... వాళ్లు అడిగినంత డబ్బు ఇచ్చుకోలేక... తప్పనిసరి పరిస్థితుల్లో బైక్‌పైనే డెడ్‌బాడీని కొంతదూరం తీసుకెళ్లారు. తిరుపతి లిమిట్స్‌ దాటి 20 కిలోమీటర్లు వెళ్లాక, అక్కడికి మరో అంబులెన్స్‌ను రప్పించుకుని అందులో ఇంటికి వెళ్లారు.

Tags

Read MoreRead Less
Next Story